![]() |
![]() |
.webp)
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -86 లో....వీరు గురించి గంగ చెప్పడానికి పెద్దసారు ఇంటికి వస్తుంది. కానీ అక్కడ గంగని శకుంతలతో పాటు అందరు అవమానిస్తారు. మోసం చేసే నువ్వు మా వీరు గురించి మాట్లాడుతున్నావా అని గంగపై శకుంతల కోప్పడుతుంది. గంగ బాధపడుతూ తిరిగి వెళ్ళిపోతుంటే రుద్ర ఎదురుపడుతాడు. ఏంటి గంగ ఇలా వచ్చావని అడుగుతాడు. ఒక విషయం గురించి చెప్పడానికి వచ్చాను.. మీరు హాస్పిటల్ లో కనిపించారని గంగ అంటుంది.
ఆ రోజు రుద్ర సర్ కి అప్పొజిట్ గా సాక్ష్యం చెప్పిన వాళ్ళతో మిమ్మల్ని హాస్పిటల్ లో చూసానని వీరుతో గంగ చెప్తుంది. మీరు వాళ్లతో ఎందుకున్నారని గంగ అడుగుతుంది. ఇదేంటి అంతా చూసినట్లు చెప్తుందని వీరు అనుకుంటాడు. నేను వాళ్ళతో ఉండి నిజం రాబట్టడానికి యాక్టింగ్ చేస్తున్నానని వీరు చెప్తాడు. రుద్ర బావ వస్తున్నాడు అతనికి కూడా చెప్పమని వీరు అనగానే ఆమ్మో వద్దని గంగ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రుద్ర వస్తూ గంగ ని చూస్తాడు. గంగ ఎందుకు వచ్చిందని వీరుని అడుగుతాడు. ఏమో బావ అని వీరు అంటాడు. వీరు గురించి చెప్పడానికి వచ్చిందని పెద్దసారు అంటాడు.
మరొకవైపు గంగ రోజంతా సంపాదించిన డబ్బుని మణి వచ్చి లాక్కొని వెళ్తాడు. తన వెనకాలే పైడిరాజు వెళ్లి నాకు మందుకి అందులో నుండి కొంచెం డబ్బు ఇవ్వమని అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |